Headlines

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం – ఉప ముఖ్యమంత్రి వెల్లడి | AP Forest Department Jobs Recruitment Update | Latest Jobs News in Telugu

ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి చాలా ముఖ్యమైన సమాచారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులులను వేటాడే వారిపైన , వన్య ప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖలో ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. 

గతంలో వచ్చిన సమాచారం ప్రకారం అటవీ శాఖలో ప్రస్తుతం 1813 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అటవీ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి ప్రకటన చేయడంతో ఈ ఖాళీలు భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. 

🔥 అర్హతలు : అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇంటర్మీడియట్ , డిగ్రీ అర్హతలు కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 

ఈ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేదా ప్రభుత్వం చెబుతున్న జాబ్ క్యాలెండర్ లో ఈ ఉద్యోగాలను కూడా చేర్చి నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది వేచి చూడాలి..

గతంలో అటవీ శాఖలో ఖాళీలు భర్తీకి ప్రభుత్వానికి అనుమతి కోరిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 👇 👇 

ఈ ప్రతిపాదనలలో 1813 ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతి కోరారు. అనుమతి కోరిన పోస్టుల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనే పోస్టులు ఉన్నాయి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ అర్హతలు : గతంలో వచ్చిన నోటిఫికేషన్లు ప్రకారం ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హత ఉన్న వారు అప్లై చేయచ్చు.

🔥 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల ఆన్లైన్ క్లాసుల కోర్స్ @ 499/- (సీనియర్ ఫ్యాకల్టీ తో క్లాసులు)

✅ అన్ని రకాల పోటీ పరీక్షల ఆన్లైన్ కోచింగ్ కోర్స్ మా APP లో 499/- Only 

  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ అర్హత ఉండాలి.
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 1813

🔥 పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇవే

  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 69
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – 402
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 1026
  • అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ – 316

🔥 గతంలో పంపిన ఈ ప్రతిపాదనలలో సర్కిల్స్ మరియు డివిజన్ల వారీగా ఉన్న ఖాళీల వివరాలు కూడా తెలిపారు. 

🔥 ఈ పోస్టులు అనంతపురం , గుంటూరు కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, FDPT శ్రీశైలం సర్కిల్స్ లో ఉన్నాయి.

🔥 ప్రభుత్వం నుండి ఈ పోస్టుల భర్తీకి అనుమతి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలవుతాయి.

🔥 ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ మరియు వెబ్సైట్, టెలిగ్రామ్ / వాట్సాప్ చానల్స్ లో కూడా మీకు సమాచారం తెలియజేయడం జరుగుతుంది. 

🔥 ఖాళీల లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!