ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు ఈ ప్రభుత్వం నుంచి విడుదల కాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఫైల్ పైనే పెట్టారు. అలాగే స్కిల్ సెన్సస్ – 2024 ఫైల్ పై కూడా మరో సంతకం చేశారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.
గత ప్రభుత్వం గ్రామ & వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చింది. రెండు సార్లు నోటిఫికేషన్స్ విడుదల చేసి ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. ఆ తరువాత చాలా ఖాళీలు ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు భర్తీకి మూడవ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దాదాపుగా గ్రామ వార్డు సచివాలయంలో 25 వేల వరకు ఖాళీలు ఉన్నట్టుగా గతంలోనే సమాచారం వచ్చింది.
ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టే ముందు గ్రామ , వార్డు సచివాలయాల శాఖను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఎమినిటీస్ సెక్రటరీలను ఇతర శాఖల్లోకి మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రెండు విభాగాల్లో సుమారు 14,500 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరిని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి , గృహ నిర్మాణ , R&B, RWS, శాఖలకు బదిలీ చేసి ఆయా శాఖల్లో ఉండే ఖాళీల కొరతను అధిగమించాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఈ శాఖల్లో ఉండే ఖాళీలను గ్రామ సచివాలయం ఉద్యోగులతో భర్తీ చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ శాఖపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం సమీక్ష చేపడితే కొత్త నియామకాలు పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🔥 పదో తరగతితో 8,326 ఉద్యోగాలు – Click here
🔥 డిగ్రీ అర్హతతో 17,727 ఉద్యోగాలు – Click here