మహరత్న కంపెనీ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా( SAIL) సంస్థ యొక్క యూనిట్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (DSP) నుండి నర్స్ మరియు ఫార్మసీస్ట్ పోస్టుల రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 18 నెలల ప్రోఫిసియన్సీ ట్రైనింగ్ ప్రోగ్రాం కొరకు ఈ సంస్థ అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ కాబడిన వారు 600 పడకలు కలిగిన మల్టీ స్పెషాలిటీ DSP హాస్పిటల్ లో పనిచేయాల్సి వుంటుంది.
పోస్టుల సంఖ్య: 73
అర్హత :
క్రమ సంఖ్య | ట్రైనింగ్ ప్రోగ్రాం పేరు | విద్యార్హత | పోస్టుల సంఖ్య |
1 | ప్రోఫిసియన్సీ ట్రైనింగ్ ఆఫ్ నర్సస్ (PTN) | a) B.SC నర్సింగ్ / డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరి b) ఇంటర్న్ షిప్ సర్టిఫికేట్ ( వర్తిస్తే) c)నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ | 69 |
2 | ప్రోఫిసియన్సీ ట్రైనింగ్ ఆఫ్ ఫార్మసీస్ట్(PTP) | a) ఫార్మసీ లో డిగ్రీ/ డిప్లొమా b) ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ | 4 |
వయస్సు: వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి. OBC – నాన్ క్రిమిలేయర్ వారికి 3సంవత్సరాలు,. ఎస్సీ& ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయోపరిమితి వుంది.
పని విధానం : షిఫ్ట్ విధానంలో రోజుకి 8 గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది.
స్టైఫండ్: నెలకి 10000/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
అప్లై చేయు విధానం: అర్హత -& ఆసక్తి కలిగిన అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం నిర్వహించే ఇంటర్వ్యూ కి అటెండ్ కావాలి.దీనికంటే కనీసం రెండురోజుల ముందు మీ యొక్క దరఖాస్తును [email protected] అనే email కి పంపించాల్సి వుంటుంది.
ఇంటర్వ్యూ షెడ్యూల్ :
క్రమ సంఖ్య | తేదీ | ఇంటర్వ్యూ సమయం |
1 | ప్రోఫిసియన్సీ ట్రైనింగ్ ఆఫ్ నర్సస్ (PTN) కొరకు 13/06/2023 నుండి 15 /06/2023 వరకు | ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు |
2 | ప్రోఫిసియన్సీ ట్రైనింగ్ ఆఫ్ ఫార్మసీస్ట్(PTP) కొరకు 20/06/2023 నుండి 21/06/2023 వరకు | ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు |
ఇంటర్వ్యూ వేదిక : మానవ వనరుల కేంద్రంవిభాగం (CHRD)దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్మెయిన్ గేట్ దగ్గరదుర్గాపూర్ – 713203, W.B.
సంప్రదించాల్సిన వ్యక్తి:
శ్రీ కె కె సాహూ,AGM (పర్స్ – మెడ్ & స్పోర్ట్స్)కాంటాక్ట్ నెం.- 03432746225
For Notification – CLICK HERE