ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఈ రోజు విడుదల చేయబోతున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. తాడేపల్లి లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఒకేసారి ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేస్తారు.
సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో మార్చ్ ఒకటి నుండి మార్చి 20వ తేదీ మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది విద్యార్థులు మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,36,056 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
వీరిలో మొత్తం 9,99,698 మంది విద్యార్థులకు పరీక్షలు రాశారు.
ఏప్రిల్ 4వ తేదీ వరకు మూల్యాంకనం జరిగింది. దాదాపుగా 23 వేల మందితో ఈ మూల్యంకనం పూర్తి చేశారు.
పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను చాలా సులభంగా క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఇదే 👇👇👇
🔥 1st Year Results – Click here
🔥 2nd Year Results – Click here