ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేసింది. మార్చి 30 నుండి ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల కారణంగా డీఎస్సీ వాయిదా పడింది.
ఎన్నికల కమిషన్ నుండి అనుమతి వచ్చాక కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 2024లో ఫిబ్రవరి 7వ తేదీన 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
టెట్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు. కానీ షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు విడుదల చేయలేదు. డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా జరగలేదు.
ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.. టెట్ ఫలితాలు విడుదల చేయకముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
పుర్తి వివరాలు : ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ మరియు ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. టెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు టెట్ మరియు డీఎస్సీ పరీక్షల మధ్య కనీసం నెల సమయం ఉండేలా చూడాలని హైకోర్టును ఆశ్రయించడంతో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు టెట్ మరియు డీఎస్సీ పరీక్షల మధ్య కనీసం ఒక నెల సమయం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనిపై చర్యలు తీసుకునే లోపే ఎన్నికల షెడ్యూల్ రావడంతో టెట్ ఫలితాలు విడుదల కాలేదు. అలాగే డీఎస్సీ రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. టెట్ ఫలితాలు విడుదలకు మరియు డీఎస్సీ నిర్వహణకు ఎన్నికల కమిషన్ ను పాఠశాల విద్యాశాఖ అనుమతి కోరింది.
ఎన్నికల కమిషన్ నుండి అనుమతి వచ్చాకే టెట్ ఫలితాలు విడుదల చేసి డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ మరియు ఆంధ్రప్రదేశ్ టెట్ అధికారిక వెబ్సైట్స్ లో కూడా ఎలక్షన్ కమిషన్ నుండి అనుమతి వచ్చాక డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారికంగా ఒక ప్రకటన చేసింది.