తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ విభాగాల్లో 5,348 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం అనుమతి ఇచ్చిన పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్స్లు , ఫార్మసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ANM , బయో మెడికల్ ఇంజనీర్లు, బయో మెడికల్ టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్స్, జూనియర్ అనలిస్ట్, సిటీ స్కాన్ టెక్నీషియన్, డెంటల్ హైజెనిస్ట్ ,ఈసీజీ టెక్నీషియన్, ఈఈజి టెక్నీషియన్ , లెక్చరర్, రేడియోగ్రాఫర్, మౌల్డ్ టెక్నీషియన్ మరియు వివిధ రకాల ఇతర పోస్టులు కూడా ఉన్నాయి.
ఈ పోస్టులన్నీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన తెలంగాణ వైద్య విద్య డైరెక్టరేట్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, MNJ క్యాన్సర్ ఆసుపత్రి, ఐపీఎం , ఆయుష్, ఔషధ నియంత్రణ మండలి వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అత్యధికంగా వైద్య విధాన పరిస్థితుల్లో 3235 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. దీంతోపాటు కొత్త వైద్య కళాశాలలతో పాటు బోధనాసుపత్రిలో కూడా ఖాళీలను భర్తీ చేస్తారు.
భర్తీ చేయబోతున్న పోస్టుల్లో అత్యధికంగా 1988 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, 1014 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 764 ల్యాబ్ టెక్నీషియన్లు, 596 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు , 192 ఫార్మసిస్ట్ పోస్టులు తో పాటు మిగతా పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ వైద్య సేవల నియామక బోర్డు (TS MHSRB)ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క సమాచారం ఎప్పటికప్పుడు మన “ INB jobs “ వెబ్సైట్ మరియు యూట్యూబ్ ఛానల్స్ లో తెలియజేయడం జరుగుతుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..