ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ నుండి ఒక శుభవార్త వచ్చింది. ఇప్పటికే గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన ఏపీపీఎస్సీ తాజాగా పోస్టుల సంఖ్యను పెంచింది. పోస్టుల సంఖ్య పెంచడం కారణంగా ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు ఎంపిక చేసే అభ్యర్థుల యొక్క సంఖ్య పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 07-12-2023 తేదీన గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
జీతము , వయస్సు, ఎంపిక విధానము , రిజర్వేషన్ల వారీగా ఖాళీలు మరియు ఇతర పూర్తి వివరాలతో 20-12-2023 తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదల చేశారు.
పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయానికి మొత్తం 899 పోస్టులు ఉన్నాయి. ఇందులో 333 ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు ఉన్నాయి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టుల్లో అటవీ శాఖలో రెండు క్యారీ ఫార్వర్డ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి.
తాజాగా అటవీ శాఖలో మరో ఆరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఖాళీలు వివరాలు ఏపీపీఎస్సీకి చేరాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరు పోస్టులు కూడా గతంలో విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ లో కలపడం జరిగింది. కాబట్టి అటవీ శాఖలో మొత్తం ఎనిమిది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
కాబట్టి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుతం 905 పోస్టులు భర్తీ చేయబోతున్నారు.
ఈ 905 పోస్టులో 333 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 572 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు ఉన్నాయి.
పోస్టుల సంఖ్య పెరిగింది కాబట్టి పోస్టుల సంఖ్యను అనుసరించి మరి కొంతమందికి మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం వస్తుంది.