ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఒకేరోజు ఏపీపీఎస్సీ గ్రూప్-2 మరియు ఎస్బిఐ జూనియర్ అసోసియేట్ మెయిన్స్ పరీక్షలు ఉన్న అభ్యర్థులకు మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు అంగీకరించారు.
గ్రూప్-2 పరీక్ష మరియు ఎస్బిఐ పరీక్ష రెండు రాస్తున్న వారు 550 మంది ఉన్నారని వారికి మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ఎస్బిఐ తెలిపింది.
ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.. పరీక్ష తేదీలో మార్పు లేకుండా ముందు చెప్పినట్లుగానే ఫిబ్రవరి 25వ తేదీనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబోతున్నారు.
APPSC Group 2 సిలబస్ ప్రకారం పూర్తి క్లాస్ లు , Pdf మెటీరియల్స్, ప్రాక్టిస్ టెస్ట్స్ మొత్తం – 399/-
APPSC Forest Beat Officer కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 899 గ్రూప్ 2 ఉద్యోగాలకు మొత్తం 4,83,525 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇటీవల గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్స్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు 4 లక్షల లక్షల 30 వేల మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు.
ఒకేరోజు ఏపీపీఎస్సీ గ్రూప్-2 మరియు ఎస్బిఐ పరీక్షలు ఉండడంతో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.
కానీ ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్ష వాయిదా వేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. కానీ లక్షల మంది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ అధికారులు , ఎస్బిఐ ఉన్నతాధికారులను సంప్రదించి ఫిబ్రవరి 25వ తేదీన ఎస్బిఐ పరీక్ష రాసే అభ్యర్థులకు మరో రోజు స్లాట్ కేటాయించాలని కోరింది. దీంతో ఎస్బిఐ మరియు గ్రూప్-2 పరీక్షలు రాసే అభ్యర్థులు వివరాలు సేకరించి తమకు పంపించాలని ఏపీపీఎస్సీ ను ఎస్బిఐ అధికారులు కోరారు.
దీంతో ఈనెల 19వ తేదీ వరకు రెండు పరీక్షలు రాసే అభ్యర్థులు వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సేకరించి మొత్తం 550 మంది అభ్యర్థులు ఉన్నట్లు తేల్చింది. దీంతో ఈ 550 మందికి మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ఎస్బిఐ తెలిపింది.
అయితే SBI పరీక్ష తేదీ మార్పు కోరుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 23 ఉదయం 9 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బిఐ సూచించింది.
ఈ రెండు పరీక్షలు రాయబోయే అభ్యర్థులు క్రింద ఉన్న లింక్ ఉపయోగించి పరీక్ష తేదీ మార్పు కోసం అప్లై చేయాలి