ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? అని వివరాలు తెలుసుకొని అర్హత గలవారు త్వరగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.
మొత్తం 13 పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ )
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గుంతకల్లు లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసే ప్రతి పోస్టుకు వేరువేరుగా అప్లికేషన్ పెట్టాలి.
భర్తీ చేసే పోస్టులు : ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, స్కావెంజర్, స్వీపర్, టెక్నికల్ ఎలక్ట్రిషన్
అర్హతలు :
ఈ పోస్టులకు అర్హతలు క్రింది విధముగా ఉండాలి
తెలుగు లేదా ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చిన వారికి, 5th క్లాస్, 7th క్లాస్, ITI వంటి అర్హతలు గల వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ఈ పోస్టుకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులవుతారు ( 01-01-2024 నాటికి). అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు వయసులో వయో సడలింపు ఇస్తారు.
ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది..
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సెలక్ట్ అయ్యే అభ్యర్థులకు జీతము క్రింది విధంగా ఉంటుంది.
ల్యాబ్ అటెండర్ – 15,000/-
ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-
వాచ్ మెన్, స్కావెంజర్ – 15,000/-
స్వీపర్ – 15,000/-
టెక్నికల్ ఎలక్ట్రిషన్ – 18,500/-
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, సరోజినీ నాయుడు గర్ల్స్ హై స్కూల్ ఆవరణము, చైతన్య థియేటర్ ఎదురుగా, ఓల్డ్ గుత్తి రోడ్డు, గుంతకల్లు- 515801 అనే చిరునామాకు అప్లికేషన్ పంపించవలెను.