ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అలెర్ట్..
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్స్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోస్టులకు 4,83,525 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అంటే ఒక్క పోస్టుకు 539 మంది పోటీ పడుతున్నారు
అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో ఓటిపిఆర్ లాగిన్ అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
APPSC Group 2 సిలబస్ ప్రకారం పూర్తి క్లాస్ లు , Pdf మెటీరియల్, ప్రాక్టిస్ టెస్ట్స్ మొత్తం – 399/-
APPSC Forest Beat Officer కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు ఇవే
- ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్ష జరుగుతుంది.
- అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9:30 నుండి 10 గంటల 15 నిమిషాల వరకు అనుమతిస్తారు.
- ఇందులో రిపోర్టింగ్ టైం 9:30 నుంచి 10:00 గంటల వరకు ఇచ్చారు.
- 10:15 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది.
- ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వం చే జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు అనగా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా పాస్ పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడి తో హాజరు కావాలి.
- అలాగే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు వాటిని అనుమతించరు.
- అభ్యర్థులు హాల్ టికెట్ ను A4 సైజ్ పేపర్ పై ప్రింట్ తీసుకొని రావాలి.
- పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రం అడ్రస్ ను చెక్ చేసుకోవాలి అని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు సూచించింది.
- అభ్యర్థులను చెక్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
- అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ పరీక్షకు తీసుకురావచ్చు.
- అప్లికేషన్ ఫారంను ఆన్లైన్లో నింపిన సమయంలో అభ్యర్థులు తమ యొక్క బయోడేటా వివరాలు తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఇన్విజిలేటర్ ను సంప్రదించి వాటిని అప్డేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు.
- పరీక్ష రాసే అభ్యర్థులకు రెండు రకాల ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. ఇందులో పైన ఉండేది ఒరిజినల్ క్రింద ఉండేది డూప్లికేట్. అభ్యర్థులు ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కి ఇచ్చి డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ ను తనతో పాటు తీసుకురావచ్చు.
- అభ్యర్థులు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలు సమాధానాలను ప్రశ్నాపత్రం బుక్లెట్ లో గుర్తించరాదు.
- ఈ పరీక్ష మొత్తం 150 నిమిషాలు ఉంటుంది. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలు ఇంగ్లీష్ లో తయారు చేయబడి తెలుగులో అనువాదం చేసి ఉంటాయి.
- వాల్యూషన్ చేసే సమయంలో ఇంగ్లీషులో వచ్చిన ప్రశ్నలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
- పరీక్ష ముగిసే వరకు ఏ ఒక్క అభ్యర్థిని పరీక్షా కేంద్రం నుండి బయటికి అనుమతించరు. ఎవరైనా అభ్యర్థులు మధ్యలోనే పరీక్ష కేంద్రం నుండి బయటకు వెళ్ళిపోతే వారిని డిస్ క్వాలిఫై చేస్తారు.