Headlines

APSRTC లో 7673 పోస్టులు భర్తీకి ప్రతిపాదనలు | భారీగా కండక్టర్, డ్రైవర్, మెకానిక్, శ్రామిక్ పోస్టులు

APSRTC Conductor Jobs syllabus
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

APSRTC Conductor Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 7673 పోస్టులు భర్తీకి అనుమతి కోరుతూ APSRTC పాలక మండలి అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ఈ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అనుమతి కోరిన పోస్టుల్లో ఎక్కువగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు మరియు శ్రామిక్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

APSRTC అనుమతి కోరిన పోస్టులు :

APSRTC పాలకమండలి మొత్తం 7673 పోస్టులు భర్తీకి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. ఇందులో ఎక్కువ సంఖ్యలో 3673 డ్రైవర్ పోస్టులు, 1813 కండక్టర్ పోస్టల్ తో పాటు మెకానిక్, శ్రామిక్ మరియు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి.

ఏ విద్యార్హతలు ఉండాలి :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి వస్తే పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ వంటి విద్యార్హతలతో ఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది.

డ్రైవర్ ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.

వయస్సు ఎంత ఉండాలి :

గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లు ప్రకారం కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం కల్పిస్తారు.

వయసులో సడలింపు ఉంటుందా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ , EWS అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు ఇస్తారు.

నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది ?

ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి ఈ ఉద్యోగాలు భర్తీకి అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో “స్త్రీ శక్తి పథకం” అమల్లో ఉన్నందున సిబ్బంది నియామకం సాధ్యమైనంత త్వరగా చేసేందుకు APSRTC సిద్ధమవుతుంది.

ఎంపిక విధానం వివరాలు :

  1. నోటిఫికేషన్ విడుదల చేసాక అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
  2. అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
  3. డ్రైవర్ ఉద్యోగాలకు డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది.
  4. తరువాత వైద్య పరీక్షలు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

Official Website – Click here

గమనిక :

ఇలాంటి వివిధ రకాల విద్యా, ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *