NABARD Development Assistant Recruitment 2026 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) సంస్థ నుండి డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 162 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణా అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
Table of Contents :
NABARD నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నుండి విడుదలైంది.
నాబార్డ్ (NABARD) భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
నాబార్డ్ (NABARD) సంస్థ ప్రస్తుతం డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
విద్యార్హతల వివరాలు :
నాబార్డ్ సంస్థలో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) ఉద్యోగాలకు 50% మార్కులతో ఇంగ్లీష్ మరియు హిందీ తప్పనిసరి లేదా ఎంపిక చేయబడిన సబ్జెక్టులగా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
అభ్యర్థి అప్లై చేసే రాష్ట్రానికి చెందిన అధికారిక భాష పదో తరగతి లేదా 12వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పోస్ట్లకి అప్లై చేసే అభ్యర్థులు తెలుగు భాష పదో తరగతి లేదా 12వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ పరీక్ష రాయవలసిన అవసరం లేదు.
PC లో వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు వివరాలు :
01-01-2026 తేదీ నాటికి 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
Ex సర్వీస్మెన్ సాయుధ దళాలలో వారు అందించిన సేవ మేరకు అదనంగా 3 సంవత్సరాల కాలపరిమితి గరిష్టంగా 50 సంవత్సరాలు
మొత్తం ఖాళీల సంఖ్య :
నాబార్డ్ ( NABARD)ద్వారా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 162 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థుల ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ నుంచి అభ్యర్థులను ఒక పోస్టుకు 25 మందిని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు.
పరీక్షలో 1/4 వ వంతు నెగిటివ్ మార్కులు విధానం అమలులో ఉంటుంది.
అభ్యర్థులు ఎంపికలో ప్రిలిమ్స్ మరియు లాంగ్వేజ్ ప్రాసెస్ టెస్ట్ లో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకోరు. మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : జనవరి 17
అప్లికేషన్ చివరి తేదీ : ఫిబ్రవరి 3
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 21
మెయిన్స్ పరీక్ష తేదీ : ఏప్రిల్ 12
అప్లికేషన్ విధానం :
అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో www.nabard.org వెబ్సైట్లో అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఎస్సీ , ఎస్టీ, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. కానీ సమాచార ఛార్జీలు మొదలైనవి 100/- చెల్లించాలి.
ఇతరులకు అప్లికేషన్ ఫీజు 450/- మరియు సమాచార ఛార్జీలు మొదలైనవి 100/- కలిపి మొత్తం 550/- రూపాయలు చెల్లించాలి.
జీతము వివరాలు :
ఈ ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులకు అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని ప్రారంభంలో 46,500/- రూపాయలు జీతము ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు :
ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రిలిమ్స్ పరీక్షను ఏలూరు, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్షను విజయవాడ మరియు విశాఖపట్నం పట్టణాల్లో నిర్వహిస్తారు.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసే ముందు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే www. inbjobs.com వెబ్సైట్ ప్రతిరోజు ఓపెన్ చేయండి.
▶️ Download Full Notification – Click here
