ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ,శిశు మంత్రిత్వ శాఖ పరిధిలో గల జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారిత వారి కార్యాలయం , వైఎస్సార్ కడప జిల్లా నుండి అంగన్వాడీ కార్యకర్త (AWW) , అంగన్వాడీ సహాయకురాలు (AWH) , మినీ అంగన్వాడీ కార్యకర్త( Mini AWW) పోస్టుల భర్తీ కొరకు నోటిిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వైఎస్సార్ కడప జిల్లా నందలి వివిధ ఐ. సి. డి. ఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా వున్న పోస్టుల భర్తీ చేస్తారు.
ఖాళీల వివరాలు: మొత్తం పోస్టల సంఖ్య -56.
వరుస సంఖ్య | పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
1 | అంగన్వాడీ కార్యకర్త (AWW) | 12 |
2 | అంగన్వాడీ సహాయకురాలు(AWH) | 40 |
3 | మినీ అంగన్వాడీ కార్యకర్త( Mini AWW) | 04 |
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 03/05/20203 |
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ | 09/05/2023 |
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం.
వయస్సు : 21 సంవత్సరాలు నిండి యుండి 35 సంవత్సరాల లోపు గల వారు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు:
1.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధి స్థానిక వివాహిత మహిళ అయి వుండాలి.
2. అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కి అప్లై చేసుకొనే అభ్యర్థులు 10 వ తరగతి పాస్ అవ్వాలి.
3.అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు అప్లై చేసుకొనే అభ్యర్థులు 7 వ తరగతి పాస్ అవ్వాలి. 7 వ తరగతి పాస్ కానివారి లేకపోతే దిగువ తరగతిలో అత్యధిక తరగతి పాస్ అయిన వారిని పరిగణలోనికి తీసుకుంటారు.
అప్లై చేయు విధానం: దరఖాస్తు చేయగొరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో ,వారి అర్హతలకి సంబందించిన అన్ని ధృవీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి,వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం ( ఐ. సి. డి. ఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం )యందు సమర్పించి తగు రసీదు పొందవలెను.
ఖాళీల వివరాలు
👉 NOTIFICATION– CLICK HERE