ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ మరో తాజా నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి వైద్య కళాశాలల్లో మరియు బోధనాస్పత్రిల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ మరియు లేటరల్ ఎంట్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థులందరూ అర్హులే.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.
ఈ పోస్టులకు ఉండవలసిన అర్హత ఏమిటి ఎంపిక విధానం ఎలా ఉంటుంది మొత్తం ఖాళీలు ఎన్ని వంటి పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుసుకోండి.
ఇలాంటి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం..
కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ .
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం పూర్తి కోర్స్ మరియు టెస్ట్ సీరీస్ కేవలం 399/- కే ( ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే)
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్
పోస్టుల పేర్లు : అసిస్టెంట్ ప్రొఫెసర్స్
అర్హత : సంబంధిత స్పెషాలిటీలో మెడికల్ PG (DNB/ DM/MCH) పూర్తి చేసి ఉండాలి.
మొత్తం ఉద్యోగాలు : 169
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
ఇంటర్వ్యు జరిగే తేదీ: 06-02-2024 తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఇంటర్వూ జరిగే ప్రదేశం:
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ,
ఓల్డ్ జిజిహెచ్ క్యాంపస్,
హనుమాన్ పేట ,
విజయవాడ.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం : పరీక్ష లేదు
అప్లికేషన్ విధానం : అర్హులేని వారు డైరెక్ట్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
ఫీజు : ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఈ ఫీజు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.
OC అభ్యర్థులకు -1000/-
EWS,BC, SC, ST, PH అభ్యర్థులకు ఫీజు – 500/-
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు డైరెక్ట్ గా అవసరమైన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.