ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో 982 పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి గారు ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా త్వరలో జరగబోతున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టరేట్లు, అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు మంజూరైన 982 పోస్టులను త్వరగా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
మరోపక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో 897 పోస్టులు భర్తీ చేయబోతున్నట్ల ప్రకటించిన ఏపీపీఎస్సీ ఇటీవల రెండు పోస్టులను పెంచింది , ప్రభుత్వ శాఖల్లో ఇంకా ఖాళీలు ఉన్నట్లు తేలిన నేపథ్యంలో గ్రూప్ 2 ఉద్యోగాలు వెయ్యికి పైగా భర్తీ చేసే అవకాశం ఉంది
డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో 240 పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా ప్రకటించిన ఏపీపీఎస్సీ తాజాగా మరో 50 పోస్టులను పెంచి మొత్తం 290 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా నోటీస్ విడుదల చేసింది.