ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం కౌశలం పేరు తో సర్వే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నిరుద్యోగులు , ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ లోగా గ్రామ, వార్డు సచివాలయం లలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంది అని ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయం ల ద్వారా ప్రతి గ్రామంలో మరియు పట్టణాలలో కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రభుత్వం, అధికారులకు కూడా సూచనలు జారీ చేసింది.
కౌశలం సర్వే ద్వారా సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఎటువంటి శిక్షణ అందించనుంది. వంటి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలియచేయడం జరిగింది. నిరుద్యోగులు అందరూ ఈ సమాచారాన్ని తెలుసుకొని వీలైనంత త్వరగా కౌశలం సర్వే లో రిజిస్టర్ చేసుకోగలరు.
Table of Contents :
🔥 నిరుద్యోగులకు వరం – కౌశలం :
- రాష్ట్రంలో గల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పించాలి అన్న ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం సర్వే నిర్వహిస్తుంది.
- రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- ఈ సర్వే లో రిజిస్టర్ అవ్వడానికి సెప్టెంబర్ 15వ తేదీ ను చివరి తేదీగా నిర్ణయించారు.
- ఆసక్తి ఉన్న వారు మీ గ్రామ, వార్డు సచివాలయం లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోగలరు.
✅ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు – Click here
🔥 కౌశలం సర్వే ఎటువంటి ఉపాధి / ఉద్యోగాలు కల్పిస్తారు :
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ రంగంలో 5 లక్షల ఉద్యోగ అవకాశాల అవసరం ఉంది. అదే విధంగా రాష్ట్రంలో చాలా మంది నైపుణ్యం కలిగిన మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్ కలిగిన వారు ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్నారు.
- ఈ అంతరాన్ని తగ్గించడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వం కౌశలం అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగ అన్వేషికులకు మరియు ప్రైవేట్ సంస్థల యాజమానుల మధ్య ఒక ప్లాట్ఫారం వలె ఏర్పాటుకానుంది.
- ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతలు మరియు టెక్నికల్ నాలెడ్జ్ కలిగి వున్న వారికి సంబంధిత రంగాలలో ఉపాధి , ఉద్యోగాలు కల్పిస్తారు.
- పరిశ్రమల అవసరాన్ని బట్టి కౌశలం సర్వే లో భాగమైన వారికి శిక్షణ కూడా అందిస్తారు.
- నైపుణ్యాలను, అవసరం అయిన శిక్షణ అందించి , ఉద్యోగాలు కల్పిస్తారు.
🔥 కౌశలం సర్వే లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి :
- గ్రామ, వార్డు సచివాలయం విభాగం ఐటిఐ , డిప్లొమా , డిగ్రీ , అంతకి మించి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారి డేటా ను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల డేటాబేస్ నందు ఇచ్చింది.
- గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వీరందరికీ సర్వే నిర్వహించి , డేటాను అప్డేట్ చేస్తున్నారు.
- వీరితో పాటుగా ఎవరైనా కౌశలం సర్వే లో భాగం అవ్వాలి అనుకుంటే మీరు మీ యొక్క ఆధార్ మరియు ఇతర సర్టిఫికెట్లను తీసుకొని సచివాలయం లో సంప్రదిస్తే మిమ్మల్ని కూడా కౌశలం సర్వే లో భాగం చేస్తారు.
✅ ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులో ఉద్యోగాలు – Click here
🔥 కౌశలం సర్వే లో ఈ పొరపాట్లు చేయవద్దు :
- రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సర్వే లో వివరాలు నమోదు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించవలసి వుంటుంది.
- ఇందులో భాగంగా వివరాలు ఇచ్చేటప్పుడు సచివాలయం సిబ్బంది అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి.
- అలానే మీ యొక్క సరైన ఇమెయిల్ మరియు పనిచేస్తున్న ఫోన్ నంబర్ ను ఇవ్వండి. ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం వస్తె వీటికే వస్తుంది కావున ఈ విషయంలో తప్పులు చేయవద్దు.
- అలానే మీ యొక్క సరైన ఈ-మెయిల్ మరియు పనిచేస్తున్న ఫోన్ నంబర్ ను ఇవ్వండి. ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం వస్తె వీటికే వస్తుంది కావున ఈ విషయంలో తప్పులు చేయవద్దు.
- మీ యొక్క విద్యార్హత సర్టిఫికెట్ లతో పాటు ఇతర ఏమైనా సర్టిఫికెట్లు అనగా కంప్యూటర్ పరిజ్ఞానం సర్టిఫికెట్ లు , ఇతర ట్రైనింగ్ కి సంబంధించిన సర్టిఫికెట్లు , మరెవైనా ఇతర సర్టిఫికెట్లు ఉన్నా కూడా వాటిని తప్పనిసరిగా అప్లోడ్ చేయించుకోండి.
🔥 కౌశలం సర్వే కొరకు అవసరమగు వివరాలు / ధ్రువపత్రాలు :
- ఆధార్ లింక్ కాబడిన ఫోన్ నెంబర్
- ఇమెయిల్ ఐడి
- విద్యార్హత
- విద్యార్హత కోర్సు ను ఎక్కడ అభ్యసించారు.
- విద్యార్హత పర్సంటేజ్ / CGPA
- విద్యార్హత సర్టిఫికెట్ కాపీలు
✅ రేషన్ కార్డుల పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – Click here
కౌశలం సర్వే ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అయ్యింది. సెప్టెంబర్ 15వ తేదీ లోగా సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ప్రభుత్వం కల్పించే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కొరకు ఎవరికైనా ఆసక్తి ఉంటే వీలైనంత త్వరగా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందిని సంప్రదించి, సర్వే లో భాగం కండి.
రాష్ట్ర ప్రభుత్వం కౌశలం సర్వేలో గల వివరాలను వెరిఫికేషన్ చేసి , అక్టోబర్ మొదటి వారంలో నైపుణ్యం కలిగిన / సాంకేతిక అర్హత కలిగిన వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది అని తెలుస్తుంది.
