Headlines

YSR విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో ఉద్యోగాలు భర్తీ | AP MLHP Notification 2023-24 | AP MLHP Recruitment 2023-24

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో YSR విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 

జోన్లవారీగా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వారు ఏ జోన్ కి చెందితే ఆ జోన్ కి చెందినటువంటి రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క కార్యాలయంలో అప్లికేషన్ ను 12-01-2024 తేదీలోపు ఆఫ్లైన్ విధానంలో అందజేయాలి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అనే పోస్టులకు ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో పోస్టింగ్ పొందవచ్చు.

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీ (2023) నుండి జనవరి 12వ తేదీ (2024) వరకు అప్లై చేయడానికి సమయం ఇవ్వడం జరిగింది. 

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 25 వేల రూపాయల జీతము ఇస్తారు. 

ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాల పరిమితికి భర్తీ చేస్తున్నప్పటికీ అభ్యర్థి యొక్క పనితీరు మరియు ఈ పథకం అమలులో భాగంగా అవసరమైన నిధులను బట్టి ప్రతి సంవత్సరం అభ్యర్థి యొక్క కాలపరిమితి పొడిగిస్తారు.

ఈ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా బిఎస్సి నర్సింగ్ లో సిపిసిహెచ్ సర్టిఫికెట్ కలిగిన వాళ్లు అప్లై చేయవచ్చు. 

ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ అనేవి ఉండవు. బిఎస్సి నర్సింగ్ లో వచ్చిన మార్కులు మరియు బిఎస్సి నర్సింగ్ పూర్తయినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు కలిపి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్స్ జోన్లవారీగా విడుదలయ్యాయి. 

జూన్ 1 లో 8 పోస్టులు , జోన్ 2 లో 15 పోస్టులు ,  జోన్ మూడు లో 15 పోస్టులు, జోన్ 4 లో 32 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ఉండవలసిన గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. అయితే ఎస్సీ,  ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ఓసి అభ్యర్థులు 300/- రూపాయల ఫీజు చెల్లించాలి. మిగతా అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. 

🔥 పోస్టులకు అప్లై చేయడానికి అవసరమైన సర్టిఫికెట్లు ఇవే 👇👇👇

1. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

ii. SSC లేదా తత్సమాన పరీక్ష

iii. ఇంటర్మీడియట్ పరీక్ష లేదా 10 + 2 పరీక్ష

iv. B.SC (N) / B.Sc (నర్సింగ్ విత్ ఇంటిగ్రల్ CPCH కోర్సు) పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్లు

v. B.Sc., (నర్సింగ్) యొక్క అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోలు

vi. BSc నర్సింగ్ లో CPCH ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ( ఉంటేనే )

vii. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ & మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌ లో శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జతపరచాలి.

viii. SC/ ST/ BC/ EWS కి సంబంధించిన కులం / కమ్యూనిటీ సర్టిఫికేట్ కాపీ (వర్గీకరణతో) రెవెన్యూ అధికారం ద్వారా జారీ చేయబడింది, అనగా తహశీల్దార్ / MRO / సంబంధిత RDO/గ్రామ / వార్డ్ సెక్రటేరియట్‌లు. కాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణించబడతారు.

ix. 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి అభ్యర్థి చదువుకున్నారు. (ప్రభుత్వం / ప్రైవేట్ / ఎయిడెడ్ / మున్సిపల్ /  ZP) లేదా

 నిర్ణీత ఫార్మాట్‌లో తహశీల్దార్ జారీ చేసిన స్థానిక హోదా సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికెట్లు సమర్పించని పక్షంలో, అభ్యర్థిని నాన్‌ లొకేల్ గా పరిగణిస్తారు. 

x. 4 నుంచి 10వ తరగతి వరకు ప్రైవేట్‌గా చదువుతున్నట్లయితే 7 ఏళ్లు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఉండాలి. ఇది తహశీల్దార్ / MRO సంబంధిత ద్వారా జారీ చేయబడుతుంది.

xi శారీరక వికలాంగుల కోసం సర్టిఫికేట్ కాపీ (వర్తిస్తే)

xii. ఎక్స్-సర్వీస్ పురుషుల కోసం సర్టిఫికేట్ కాపీ (వర్తిస్తే)

xiii. స్పోర్ట్స్ కోటాకు మద్దతుగా సర్టిఫికేట్ కాపీ (వర్తిస్తే)

గమనిక: B.Sc కాకుండా ఇతర అభ్యర్థులు పోస్ట్లు కోసం దరఖాస్తు చేస్తే, వారి దరఖాస్తు పూర్తిగా తిరస్కరించబడుతుంది. మాలో ఇప్పటికే CHO / MLHP గా పనిచేస్తున్న వారు అప్లై చేయడానికి అర్హులు కాదు.

జోన్లవారీగా నోటిఫికేషన్లు మరియు అప్లికేషన్లు డౌన్లోడ్ చేయండి 👇👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!