ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో దాదాపు 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు భర్తీకి అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పిసిసిఎఫ్ ( ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ) మధుసూదన్ రెడ్డి గారు తెలిపారు.
అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
హార్స్లీ హిల్స్ పై జరుగుతున్న అటవీశాఖ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు పంపించినట్లు , ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఆయన తెలిపిన వివరాల ప్రకారం 50 రేంజ్ పోస్టులు, 200 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు , 750 బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. ఈ పోస్టులకు అనుమతులు వస్తే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం అనుమతి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసి అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఈ నోటిఫికేషన్స్ విడుదల చేస్తే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త గానే చెప్పవచ్చు.
Good
I am interested this plz give me chance sir
Nice job I like this job I want here sir
St