SVRR Government General Hospital Recruitment 2026 : గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, తిరుపతి నుండి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది..
ఈ నోటిఫికేషన్ ద్వారా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 7వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, తిరుపతి నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, తిరుపతి నందు ఉన్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్, యోగా థెరపిస్ట్ / నృత్యం / సంగీతం / కళా ఉపాధ్యాయుడు, చౌకీదార్లు, హౌస్ కీపింగ్ వర్కర్ అనే పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 08 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
ఈ ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.

అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19-02-2026 నుండి 07-03-2026 తేదీలోపు అప్లై చేయాలి.
జీతము వివరాలు :
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సెలర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 25,000/- జీతము ఇస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 12,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
పీర్ ఎడ్యుకేటర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 10,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
వార్డ్ బాయ్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 13,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
యోగా థెరపిస్ట్ / నృత్యం / సంగీతం / కళా ఉపాధ్యాయుడు ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 5,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
చౌకీదార్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 9,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
హౌస్ కీపింగ్ వర్కర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 9,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేదీ : 19-02-2026
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-02-2026
అప్లికేషన్ చివరి తేదీ : 07-03-2026
ప్రొవిజినల్ మెరిట్ తేదీ : 24-03-2026
ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 30-03-2026
సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేది : 02-04-2026
వయస్సు వివరాలు :
01-07-2025 తేదీ నాటికి వయస్సు 42 సంవత్సరాల లోపు ఉండాలి.
SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఫీజు వివరాలు :
HDS, SVRRGGH, Tirupati అనే పేరు మీద అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 250/- రూపాయలు
SC, ST, BC, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200/- రూపాయలు.
ఎంపిక విధానం వివరాలు :
అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
O/o the Addl.DME / Superintendent, SVRR Government General Hospital, Tirupati
ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
