RRB Group D Notification 2026 : భారతీయ రైల్వేలో గ్రూప్ “డి” ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 21,997 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. పదో తరగతి లేదా ఐటిఐ విద్యార్హత ఉన్న నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు, అప్లికేషన్ ఫీజు, జీతము, ఎంపిక విధానము, సిలబస్, అప్లై విధానము మరియు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో త్వరగా అప్లై చేయండి.
ఇలాంటి వివిధ రకాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ లో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ లో రావాలి అంటే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి.
Table of Contents
రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
భారతీయ రైల్వేలో రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ప్రతి సంవత్సరం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల నుండి ఈ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా వివిధ రైల్వే జోన్ లో ఖాళీగా ఉన్న గ్రూప్ డి పోస్టులు భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21,997 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
రైల్వే లో వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఇవే : అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్), అసిస్టెంట్ (బ్రిడ్జి), ట్రాక్ మెయింటైనర్ (గ్రూప్ IV), అసిస్టెంట్ (పి-వే), అసిస్టెంట్ (TRD), అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ (TL & AC)
విద్యార్హతల వివరాలు :
ఈ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఐటిఐ పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 31వ తేదీ నుండి మార్చి 2వ తేదీలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ విధానం :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి.
ఎంపిక విధానం ప్రకారం :
అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష , ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టులు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
OC , EWS, OBC అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
SC, ST, PWD అభ్యర్థులు 250/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని నెలకు 45,000/- రూపాయలతో జీతము ప్రారంభమవుతుంది.
ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ www.inbjobs.com వెబ్సైట్ ఓపెన్ చేయండి.
▶️ Download Full Notification – Click here
