Postal GDS Recruitment 2026 Apply Link : పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి GDS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 28,740 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
Table of Contents
నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వ సంస్థ :
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
కానీ అభ్యర్థి అప్లై చేసే రాష్ట్రంలో మాట్లాడే స్థానిక భాష వచ్చి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో 1060 పోస్టులు, తెలంగాణ సర్కిల్ లో 609 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అప్లికేషన్ విధానం :
అర్హత గల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు పోస్టర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అప్లికేషన్ తేదీలు :
అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ విధానంలో భాగంగా జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ లోపు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
ఆన్లైన్ అప్లికేషన్ మరియు అప్లికేషన్ ఫీజు ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 16వ తేదీలోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం వివరాలు :
అప్లై చేసుకున్న అభ్యర్థులను పదో తరగతిలో వచినత్ మార్కుల మెరిట్ ఆధారంగా తయారు చేసిన సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతము వివరాలు :
BPM ఉద్యోగాలకు TRCA Slab 12,000/- నుండి 29,380/- వరకు జీతం ప్రకారం జీతం చెల్లిస్తారు.
ABPM / Dak Sevak ఉద్యోగాలకు 10,000/- నుండి 24,470/- ప్రకారం జీతం చెల్లిస్తారు.
వయస్సు వివరాలు :
పోస్టల్ డిపార్ట్మెంట్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
SC , ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది.
▶️ Download Full Notification – Click here
✅ ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతీ రోజూ మీ తెలుసుకోవడానికి మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
