Good News ! ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Pharmacy Council Of India Scrutinizer Notification 2026

Pharmacy Council Of India Scrutinizer Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Pharmacy Council Of India Scrutinizer Jobs Walk in Interview : కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకి చెందిన చట్టబద్ధ సంస్థ అయిన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి స్క్రూటినైజర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. E నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన చట్టబద్ధ సంస్థ అయిన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేయబడింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా స్క్రూటినైజర్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 స్క్రూటినైజర్ ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

అర్హతల వివరాలు :

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు డి.ఫార్మసీ లేదా బీ.ఫార్మసీ లేదా ఫార్మా.డి విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.

జీతము వివరాలు :

ఎంపికైన వారికి నెలకు 35,000/- జీతం చెల్లిస్తారు.

ఉద్యోగాల కాల పరిమితి వివరాలు :

ప్రస్తుతం ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల మెరిట్ మరియు పనితీరు ఆధారంగా కొనసాగిస్తారు.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ :

ఫిబ్రవరి 10వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :

Pharmacy Council of India, I-300, 3rd floor, Tower-I, World Trade Centre,
Nauroji Nagar, New Delhi – 110 029

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

అర్హులైన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరై ముందు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

ఇలాంటి వివిధ ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

▶️ Download Full Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *