BSNL Senior Executive Trainee Recruitment 2026 : భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) నుండి చాలా రోజుల తర్వాత బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా BSNL సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 5వ తేదీ నుండి మార్చి 7వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మార్చి 29వ పరీక్ష నిర్వహించనున్నారు.
BSNL నుండి విడుదల అయిన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం) పోస్టులు – 95 ఉన్నాయి. మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) – 25 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతల వివరాలు :
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం) పోస్టులకు క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉండాలి.
కింది వాటిలో ఏదైనా విభాగంలో బి.ఇ/బి.టెక్ పూర్తి చేసి ఉండాలి.
1.ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్
2.ఎలక్ట్రానిక్స్
3.కంప్యూటర్ సైన్స్
4.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
5.ఎలక్ట్రికల్
6.ఇన్స్ట్రుమెంటేషన్
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) ఉద్యోగాలకు CA , CMA పూర్తి చేసిన వారు అర్హులు.
అప్లికేషన్ విధానం :
BSNL సంస్థ భర్తీ చేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
ఎంపిక విధానం వివరాలు :
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్లు నిర్వహించి ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 5వ తేదీ నుండి మార్చి 7వ తేదీలోపు అప్లై చేయాలి.
ఎంపిక ప్రక్రియలో భాగంగా మార్చి 29వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
OC / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు : 2500/- రూపాయలు
SC / ST / PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు : 1250/- రూపాయలు
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ www.inbjobs.com వెబ్సైట్ ఓపెన్ చేయండి.
▶️ Download Full Notification – Click here
▶️ Official Website – Click here
