AP Anganwadi Worker and Ayah Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రెండు జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేశారు.. 7వ తరగతి లేదా పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
Table of Contents :
NTR జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు :
NTR జిల్లాలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో 6 ICDS ప్రాజెక్టులు పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో 10 అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలు మరియు 141 ఆయా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, మైలవరం, చిలకల్లు, నందిగామ, తిరువూరు అంగన్వాడిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు.
స్థానిక వివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
అర్హత గల అభ్యర్థులు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
ఎన్టీఆర్ జిల్లాలో అంగన్వాడి ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : ఫిబ్రవరి 5
కర్నూలు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు :
కర్నూలు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 మెయిన్ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, రెండు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు మరియు 54 ఆయా పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకు 10 వ తరగతి విద్యార్థులు ఉన్న వివాహిత మహిళలు, ఆయా ఉద్యోగాలకు 7వ తరగతి విద్యార్హత ఉన్న వివాహిత మహిళలు అర్హులు.
01-07-2025 తేదీ నాటికి కనీసం 21 సంవత్సరాలు నుండి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
కర్నూలు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఐసిడిఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల్లో సంప్రదించి వివరాలు తెలుసుకొని అప్లై చేయవచ్చు.
కర్నూలు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : ఫిబ్రవరి 3
▶️ Download Notifications Details – Click here
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి, నోటిఫికేషన్ వివరాలన్నీ డౌన్లోడ్ చేసి చదివిన తరువాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేసి చదవండి.
