హైదరాబాద్ ఎయిమ్స్ బీబీనగర్ లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AIIMS Bibinagar Notification 2026

AIIMS Bibinagar Latest Notification
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AIIMS Bibinagar Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన హైదరాబాద్ బీబీనగర్ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి “ఒక ఆరోగ్యం కోసం ప్రాంతీయ సమన్వయకర్త” (RCOH) అనే ప్రోగ్రాంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ లో తెలిపారు.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ :

ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ బీబీనగర్ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి “ఒక ఆరోగ్యం కోసం ప్రాంతీయ సమన్వయకర్త” (RCOH) అనే ప్రోగ్రాంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ల్యాబ్ టెక్నీషియన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ – 01 పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01 పోస్టు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు వివరాలు :

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి మైక్రోబయాలజీ లాబొరేటరీ టెక్నాలజీ/లైఫ్ సైన్సెస్ వంటి సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 1. డేటా ఎంట్రీ వర్క్ పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్. టైపింగ్ వేగం: ఇంగ్లీష్ 40 WpM తెలుగు మరియు/లేదా హిందీ: 30 MS-CIT కలిగి ఉన్న WpM. 2. recogniz నుండి కంప్యూటర్ అప్లికేషన్/IT/కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

జీతము వివరాలు :

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు 30,000/- రూపాయలు జీతము ఇస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 20,000/- రూపాయలు జీతం ఇస్తారు.

వయస్సు వివరాలు :

ల్యాబ్ టెక్నీషియన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 21 నుండి 35 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ ఒక పోస్ట్ కు 50 మంది కంటే ఎక్కువమంది అభ్యర్థులు అప్లై చేస్తే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. దీనికోసం అర్హత గల అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి వెబ్సైట్ లో లిస్టు పెడతారు. ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూ మరియు పరీక్షకు హాజరు కావాలి. పరీక్ష మరియు ఇంటర్వ్యూ 25-02-2026 తేదీన నిర్వహిస్తామని నోటిఫికేషన్లో తాత్కాలికంగా ప్రకటించారు.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

Dr. Rahul Narang, PI, Regional C o-Ordinator for One Health (RCOH), Department of Microbiology, AIIMS, Bibinagar, Telangana Pin Code 508126

Download Full Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *