ఆంధ్ర, తెలంగాణలో ఆధార్ సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Aadhar Supervisor Recruitment 2026

Aadhar Supervisor Recruitment 2026 Apply Online
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

How to Apply Aadhar Supervisor Jobs : దేశవ్యాప్తంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్స్ లో ఆధార్ సూపర్వైజర్ / ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ / ఐటిఐ / డిప్లొమా విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కామన్ సర్వీస్ సెంటర్స్ లో ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగి అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

మొత్తం ఖాళీల సంఖ్య :

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం 260 పైగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, YSR కడప ప్రకాశం జిల్లాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ , కరీంనగర్ , మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ , నిర్మల్ , పెద్దపల్లి , సంగారెడ్డి , వనపర్తి , యాదాద్రి భువనగిరి , నిజామాబాద్ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు..

అర్హతలు :

ఆధార్ సూపర్వైజర్ / ఆపరేటర్ ఉద్యోగాలకు 12th పాస్ / ఐటిఐ / డిప్లొమా అర్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

అభ్యర్థి ఆధార్ సేవను అందించడానికి UIDAI అధికారం ఇచ్చిన టెస్టింగ్ & సర్టిఫికేషన్ ఏజెన్సీ జారీ చేసిన ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి 

జీతము వివరాలు :

అభ్యర్థి అప్లై చేసే రాష్ట్రంలో సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ కి చెల్లించే వేతనాలకు సమానంగా చెల్లిస్తారు.

అప్లికేషన్ తేదీలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో 10-02-2026 తేదీ నుండి 11-04-2026 తేదీలోపు అప్లై చేయాలి.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. ప్రతీ రోజు కొత్త నోటిఫికేషన్లు సమాచారం తెలుసుకోవడానికి మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

LMS Verification Link – Click here

Aadhar Supervisor Exam link – Click here

Notification Details – Click here

Online Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *