ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. DSC నోటిఫికేషన్ విడుదల కొరకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వం మరో 3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ కి సంబంధించి రెండు కీలక పరిణామాలు జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కు సంబంధించిన గెజిట్ ను విడుదల చేసింది. దీనితో పాటు DSC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థుల గరిష్ఠ వయస్సు ను 42 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచుతూ G.O విడుదల అయ్యింది.
ఈ G.O లలో ప్రస్తావించిన అన్ని అంశాలను , DSC ఉద్యోగాలకు అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 ఏపీ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలను భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
- DSC ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 16,347 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- స్కూల్ అసిస్టెంట్లు – 7725
- SGT – 6371
- TGT – 1781
- PGT – 286
- PET – 132
- ప్రిన్సిపాల్ – 52
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- SGT పోస్ట్లు , స్కూల్ అసిస్టెంట్లు, TGT, PGT, PET, ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేస్తారు.
- జిల్లాల వారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్ లో ప్రస్తావిస్తారు.
🔥 విద్యార్హత :
- సంబంధిత విభాగంలో B.Ed, DIET ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు కలదు.
🔥 వయోపరిమితి పెంపు :
- DSC – 2025 కి సంబంధించి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠ వయోపరిమితిని 42 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచారు.
- ఈ వయస్సు పెంపుదల కటాఫ్ తేదీగా 01/ జూలై / 2024 గా నిర్ణయించారు.
- ఈ వయోపరిమితి పెంపు కేవలం ఈ DSC నోటిఫికేషన్ కు మాత్రమే వర్తిస్తుంది అని G.O లో ప్రస్తావించారు.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా లో దరఖాస్తుచేసుకోవాలి.
🏹 ఏపీలో 2260 పోస్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ – Click here
🔥 ఎంపిక విధానం :
- టెట్ మరియు డీఎస్సీ పరీక్ష లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 కొలిక్కి వచ్చిన SC వర్గీకరణ :
- రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన G.O ను G.O.Ms.NO : 19 , తేదీ : 17/04/2025 ద్వారా పూర్తిగా వివరించారు.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి మంచి జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన సమాచారం :
- ఈ ఉద్యోగాలకు మరికొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
- కావున అభ్యర్థులు సిలబస్ ను ప్రాదిపతికగా చదువుకోగలరు.
🔥 45 రోజుల్లోగా పరీక్ష నిర్వహణ :
- రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉద్యోగాలను భర్తీ చేయాలనే సంకల్పం ఉండడం తో, నోటిఫికేషన్ విడుదల అయిన 45 నుండి 50 రోజుల్లోగా పరీక్ష నిర్వహించారు.
నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత పూర్తి సమాచారాన్ని మరొక ఆర్టికల్ లో తెలియచేస్తాం.
👉 Click here to download age enhancement G.O
👉 Click here for SC sub classification G.O