ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కొరకు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త తెలియచేసింది.
అభ్యర్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ముందుకు వెళ్లేందుకు గాను సూచనలు కనిపిస్తున్నాయి.
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖా మంత్రి అనిత గారు “ ఇంకో నెల రోజులలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలియజేశారు.”
🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ద్వారా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను 2022 లో విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 6,100 ఉద్యోగాలను భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఆంధ్రప్రదేశ్ లో సివిల్ & APSP కానిస్టేబుల్ భర్తీ చేయుటకు గాను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 విద్యార్హత :
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.
🔥 వయస్సు :
18 సంవత్సరాలు నిండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.
బీసీ లకు 3 సంవత్సరాల వయొసడలింపు లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
ప్రిలిమినరీ వ్రాత పరీక్ష & ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ & ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెయిన్స్ వ్రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 కొనసాగుతున్న అడ్డంకులు :
ప్రిలిమినరీ వ్రాత పరీక్ష 2023 జనవరి లో నిర్వహించారు.
ఆ తర్వాత కాలంలో పలు కారణాల వలన, కోర్టు కేసుల వలన ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా కాలం పెండింగ్ లో ఉండి పోయింది.
ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 30 , 2024 నుండి ఫిబ్రవరి 01 , 2025 వరకు నిర్వహించారు.
ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహణ పై ప్రభుత్వం దృష్టి సారించింది.
🔥ఆందోళన లో అభ్యర్థులు :
రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి, ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.
ఎప్పుడో 2022 లో నోటిఫికేషన్ వచ్చి, ఇప్పటికీ రిక్రూట్మెంట్ పూర్తి కాకపోవడం తో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టి సారించి ,సమస్యలను వీలనంత త్వరగా తొలగించి, మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలి అని,వీలైనంత త్వరగా పోస్టింగులు ఇవ్వాలి అని కోరుతున్నారు.
🔥 మరో నెలరోజుల లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తాం – హోంమంత్రి గారు :
రాష్ట్రంలోని కానిస్టేబుల్ నియామకాల అంశంపై హోమ్ మంత్రి గారు ముఖ్యమైన సమాచారాన్ని తెలియచేశారు.
దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి , ఆ ఫలితాలను వెంటనే తెలియచేశామని పేర్కొన్నారు.
ప్రస్తుతం మెయిన్స్ పరీక్షల నిర్వహణ కొరకు ఇంకా కోర్టు కేసులు ఉన్నాయని, వీలైనంత త్వరగా ఈ కేసులను క్లియర్ చేసి, నెల రోజుల లోగా మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేస్తారు.