ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ నుండి అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయి (మ్యూజిషియన్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు దేశంలోని అవివాహితులు అయిన మహిళా మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 10 జూన్ 2025 నుండి 18 జూన్ 2025 వరకు రేర్ కోర్సు క్యాంప్, న్యూ ఢిల్లీ & 7 ASC , No.1 కుబ్బాన్ రోడ్ బెంగళూరు (కర్ణాటక) నందు నిర్వహించు ర్యాలీ కి హాజరు కావాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
అగ్నిపద్ పథకం క్రింద అగ్నివీర్ వాయు (మ్యూజిషియన్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత :
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్ / పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
అభ్యర్థులు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి, టెంపో, పిచ్ మరియు ఒక పూర్తి పాటను ఖచ్చితంగా పాడాలి. వారు ఒక సన్నాహక ట్యూన్ మరియు స్టాఫ్ నొటేషన్/ టాబ్లేచర్ / టానిక్ సోల్ఫా / హిందుస్తానీ / కర్ణాటక మొదలైన వాటిలో ఏదైనా నొటేషన్‌ను ప్రదర్శించగలగాలి. అభ్యర్థులు వ్యక్తిగత వాయిద్యాలను (ట్యూనింగ్ అవసరమయ్యే వాయిద్యాల విషయంలో) ట్యూన్ చేయగలగాలి మరియు గాత్రం లేదా వాయిద్యాలపై తెలియని గమనికలను సరిపోల్చగలగాలి.
నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నందు ప్రావీణ్యత కలిగి వుండాలి.
మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కలిగి వుండాలి.
🔥 వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 సంవత్సరాల లోపు గల వారై వుండాలి.
జనవరి 01 2005 నుండి జూలై 01 2008 లోపు గా జన్మించిన వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
🔥 మెడికల్ స్టాండర్డ్స్ :
పురుష అభ్యర్థులు :
కనీసం 162 సెంటీమీటర్ల ఎత్తు కలిగి వుండాలి.
ఎత్తుకి తగిన బరువు కలిగి వుండాలి.
77 సెంటీమీటర్ల ఛాతి కలిగి, 5 సెంటీమీటర్ల విస్తరణ రావాలి.
పూర్తి ఆరోగ్యవంతులు అయి వుండాలి.
మహిళా అభ్యర్థులు :
కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు కలిగి వుండాలి.
ఎత్తుకి తగిన బరువు కలిగి వుండాలి.
5 సెంటీమీటర్ల ఛాతి విస్తరణ వుండాలి.
పూర్తి ఆరోగ్యవంతులు అయి వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు :
అభ్యర్థులు 100/- రూపాయల అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రొఫెసయన్సీ టెస్ట్, వ్రాత పరీక్ష , ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్ష :
OMR ఆధారిత ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను ఇస్తారు.
పదవ తరగతి స్థాయి ఇంగ్లీష్ ప్రశ్నలు 30 ఇస్తారు. 30 నిముషాల సమయం కేటాయించారు.
🔥 ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వివరాలు :
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

🔥 జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి
మొదటి సంవత్సరం – 30,000/- రూపాయలు (నెలకు)
రెండవ సంవత్సరం – 33,000/- రూపాయలు (నెలకు)
మూడవ సంవత్సరం – 36,500/- రూపాయలు (నెలకు)
నాల్గవ సంవత్సరం – 40,000/- రూపాయలు (నెలకు) జీతం లభిస్తుంది.
ఇందులో 70 శాతం ఉద్యోగులకు ఇచ్చి , 30 శాతం కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు.
ఉద్యోగులు ఎంత అయితే కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు అంత అదనపు మొత్తాన్ని భారత ప్రభుత్వం కార్పస్ ఫండ్ కి జమ చేస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 21/04/2025 (ఉదయం 11:00 గంటల నుండి)
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 11/05/2025 (రాత్రి 11:00 గంటల వరకు)
👉 Click here for official website