Headlines

ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | AP Rural Water Supply and Sanitation Department Jobs | Swach Bharat Mission Jobs

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లో పనిచేసేందుకు గాను స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) క్రింద రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు 2 సంవత్సరాల అనుభవం కలిగి వున్న వారు దరఖాస్తు చేసుకోవాలి అని సూపరిండెంటింగ్ ఇంజనీర్, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ , విశాఖపట్నం వారు ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,జీతం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, విశాఖపట్నం నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

ఈ క్రింది విభాగాలలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.

మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్

అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

 🔥 విద్యార్హత :

మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ :

కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి మరియు కంప్యూటర్ రంగంలో 2 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ :

ఎన్విరాన్మెంట్ స్టడీస్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి మరియు గ్రామీణ ప్రాంతాలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.

అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ :

డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ,కంప్యూటర్ పరిజ్ఞానం పై రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి. మరియు టైపింగ్ లో అప్పర్ హ్యాండ్ వచ్చి వుండాలి.

🔥  గరిష్ట వయస్సు :

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.

వయస్సు నిర్ధారణ కొరకు 31/12/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

వయస్సు , విద్యార్హత మొదలగు విషయాల నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా31/12/2024 ను నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ లో ప్రస్తావించిన చిరునామా కు నేరుగా లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.

🔥 దరఖాస్తు చేరవేయవలసిన చిరునామా :

సూపరిండెంటింగ్ ఇంజనీర్,

రూరల్ వాటర్ అండ్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ , 

జిల్లా పరిషత్ కాంపౌండ్ , 

మహారాణిపేట, 

విశాఖపట్నం – 530002

కాంటాక్ట్ నెంబర్ :8333885738

se_rws_vspm_@ap.gov.in , serwsvizag@gmail.com 

🔥 ఎంపిక విధానం :

డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 20,000/- రూపాయల కన్సాలిడేటెడ్ పే లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 15/04/2025.

👉  Click here for notification

👉 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!