ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో 1289 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP DME SR Recruitment | Latest Jobs in Andhrapradesh

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం , డైరెక్టెరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో సీనియర్ రెసిడెంట్ – 2024 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం లో భాగంగా భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 ఏపీ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు భర్తీ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఆంధ్రప్రదేశ్ డైరెక్టెరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • మొత్తం 1289 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  •  సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు ను పలు విభాగాలలో భర్తీ చేయనున్నారు.

🔥 విద్యార్హత

  • నేషనల్ మెడికల్ కమిషన్ రేగులేషన్స్ ఆధారంగా అర్హత ను నిర్ధారించారు.
  • సంబంధిత విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎం డి / ఎంఎస్ / ఎంసిహెచ్ / డిఎం ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి వుండాలి.

🔥  వయస్సు :

  • నోటిఫికేషన్ విడుదల అయిన తేది నాటికి అభ్యర్థుల వయస్సు 44 సంవత్సరాలు దాటి వుండరాదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తుచేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

  • ఓసి అభ్యర్థులు 2,000/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1,000/- రూపాయలు దరఖాస్తు ఫీజు ఆన్లైన్ లో  చెల్లించాలి.

🔥 అవసరమగు ధృవపత్రాలు :

  • 10 వ తరగతి  సర్టిఫికెట్లు
  • పీజీ డిగ్రీ & ఏపీ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి వుండాలి.
  • పీజీ మార్క్స్ మెమోలు
  • ఎంబీబీఎస్ & పీజీ డిగ్రీ సర్టిఫికేట్ లేదా డిగ్రీ ప్రొవిజనల్ 
  • ఇటీవల కుల దృవీకరణ పత్రం
  • 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు
  • దివ్యాంగులు అయితే సంబంధిత దృవీకరణ పత్రం
  • ఆధార్ కార్డు

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా విద్యార్హత కి సంబంధించి కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జీతం:

  • బ్రాడ్ స్పెషాలిటీస్ గా ఎంపిక కాబడిన వారికి 80,500/- , సూపర్ స్పెషాలిటీ గా ఎంపిక కాబడిన వారికి 97,750/- రూపాయల నెలకు జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  •  ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 28/12/2024.
  • ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 08/01/2025.

👉  Click here to download notification

👉 Click here to apply online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!