ప్రభుత్వ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ , టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | CDFD Recruitment 2024 | CDFD Junior Assistant Notification 2024

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో గల అటానమస్ సంస్థ అయిన సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (CDFD) నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

హైదరాబాద్ ప్రధాన కేంద్రం గా గల ఈ సంస్థ నుండి టెక్నికల్ ఆఫీసర్ , టెక్నికల్ అసిస్టెంట్ ,జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ , స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 గ్రామీణ విద్యుత్ కార్యాలయాల్లో “ సహాయ అధికారి” ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (CDFD) సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • అన్ని విభాగాలలో కలిపి మొత్తం 8 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • టెక్నికల్ ఆఫీసర్ – I
  •  టెక్నికల్ అసిస్టెంట్
  • టెక్నికల్ అసిస్టెంట్
  • జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్ 
  • జూనియర్ అసిస్టెంట్ -II 
  • జూనియర్ అసిస్టెంట్ -II
  • స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ -II
  • స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ -II

🔥 విద్యార్హత : 

  1. టెక్నికల్ ఆఫీసర్ – I : 
  • ఫస్ట్ క్లాస్ బి.ఎస్సీ డిగ్రీ తో పాటుగా 5 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

        లేదా

  •  ఏం.ఎస్సీ పూర్తి చేసి , సంబంధిత విభాగం లో 2 సంవత్సరాల అనుభవం అవసరం.
  1.  టెక్నికల్ అసిస్టెంట్ : 
  • ఫస్ట్ క్లాస్ బి. ఎస్సీ / బి. టెక్ తో పాటుగా 3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

           లేదా

  • సైన్స్ టెక్నాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా సైన్స్ టెక్నాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా తో పాటు ఒక సంవత్సరం అనుభవం అవసరం.
  1.  జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్ :
  • గ్రాడ్యుయేషన్ తో పాటు 3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
  • ఇంగ్లీష్ టైపింగ్ లో నిముషానికి 30 పదాలు , ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నిముషానికి 80 పదాలు చేయగలిగే నైపుణ్యం కలిగి వుండాలి.
  1.  జూనియర్ అసిస్టెంట్ -II : 
  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12 వ తరగతి పూర్తి చేసి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
  • ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో నిముషానికి 35 పదాలు లేదా హిందీ లో నిముషానికి 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
  1. స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ -II
  • గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.

🔥  గరిష్ట వయస్సు :

  • టెక్నికల్ ఆఫీసర్ – I , టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ -II , స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ -II ఉద్యోగాలకు 25 సంవత్సరాల లోపు వయస్సు గల వారు అర్హులు.
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు & ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఆ హార్డ్ కాపీ ను సంబంధిత చిరునామాకు చివరి తేది లోగా చేరవేయాలి.
  • 31/12/2024 సాయంత్రం 6:00 గంటల లోగా దరఖాస్తు చేసుకోవ

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా :

  • దరఖాస్తు పంపించే ఎన్వలప్ పై 

“APPLICATION FOR THE POST OF __________ (Post Code ________” ప్రస్తావించాలి.

  • To The Head-Administration, Centre for DNA Fingerprinting and Diagnostics, Inner Ring Road, Uppal, Hyderabad – 500039, 

Telangana

  • దరఖాస్తు 15/01/2024 లోగా చిరునామాకు చేరాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు 200/- రూపాయల అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ లో  చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

అభ్యర్థులను వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

వ్రాత పరీక్ష కు 85 శాతం మార్కులు & ఇంటర్వ్యూ కి 15 శాతం మార్కులు కేటాయించారు.

🔥 జీతం

  • టెక్నికల్ ఆఫీసర్ – I & టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 70,290 /- రూపాయల జీతం లభిస్తుంది.
  • జూనియర్ మేనేజీరీల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 58,944/- రూపాయలు జీతం లభిస్తుంది.
  • జూనియర్  అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 38,483/- రూపాయలు జీతం లభిస్తుంది.
  • స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ -II ఉద్యోగాలకు నెలకు 35,006/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 02/12/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 31/12/2024
  • హార్డ్ కాపీ చేరేందుకు గాను చివరి తేది:15/01/2024

👉  Click here to Download notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!