భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC) యొక్క సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ నుండి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు..
భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్ (OG) , టెలి ఆపరేటర్ గ్రేడ్-2, ఫైర్ మ్యాన్, కార్పెంటర్ మరియు జాయినర్, పెయింటర్ మరియు డెకరేటర్, MTS , ట్రేడ్స్ మెన్ మేట్ అనే వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి, ఐటిఐ, 12వ తరగతి మరియు డిగ్రీ వంటి అర్హతలతో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది..
ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీరు తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC) యొక్క సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేయబోయే పోస్ట్లు మరియు ఖాళీల సంఖ్య :
పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
మెటీరియల్ అసిస్టెంట్ | 19 |
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ | 27 |
సివిల్ మోటార్ డ్రైవర్ (OG) | 04 |
టెలి ఆపరేటర్ గ్రేడ్ -2 | 14 |
ఫైర్ మ్యాన్ | 247 |
కార్పెంటర్ మరియు జాయినర్ | 07 |
పెయింటర్ మరియు డెకరేటర్ | 05 |
MTS | 11 |
ట్రేడ్స్ మ్యాన్ మేట్ | 389 |
🔥 విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, ఐటిఐ, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న వారికి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సు :
- మెటీరియల్ అసిస్టెంట్ , సివిల్ మోటార్ డ్రైవర్ (OG) ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 27 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
- మిగతా అన్ని రకాల ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- మెటీరియల్ అసిస్టెంట్ మరియు టెలి ఆపరేటర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు టైపింగ్ ప్రోఫిషియన్సీ టెస్ట్ మరియు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- సివిల్ మోటార్ డ్రైవర్ డ్రైవింగ్ టెస్ట్ మరియు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు
- ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు PMT, PET మరియు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- కార్పెంటర్ మరియు జాయినర్, పెయింటర్ మరియు డెకరేటర్ ఉద్యోగాలకు ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగాలను PET మరియు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతము :
- మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/- వరకు జీతము ఇస్తారు.
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు జీతం ఇస్తారు.
- సివిల్ మోటార్ డ్రైవర్ (OG) ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు జీతం ఇస్తారు.
- టెలి ఆపరేటర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు జీతం ఇస్తారు.
- ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు జీతం ఇస్తారు.
- కార్పెంటర్ మరియు జాయినర్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు జీతం ఇస్తారు.
- పెయింటర్ మరియు డెకరేటర్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు జీతం ఇస్తారు.
- MTS ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు వరకు జీతం ఇస్తారు.
- ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు వరకు జీతం ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- ఈ ఉద్యోగాలకు 02-12-2024 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 22-12-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here