GST మరియు ఎక్సైజ్ డిపార్టుమెంట్ లో ఉద్యోగాలు భర్తీ | CGST & Central Excise Department Recruitment 2024 | Tax Assistant Jobs Notification 2024

సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (CGST) & సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ట్యాక్స్ అసిస్టెంట్ మరియు హవల్దార్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి మరియు డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు వివిధ ఆటలు లేదా క్రీడలలో ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది. చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకుని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. 

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.

  • ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్  అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

 🏹 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేయబోయే పోస్టులు  :

  • వివిధ ఆటలు లేదా క్రీడలలో ప్రతిభావంతులైన క్రీడాకారుల కోటాలో ట్యాక్స్ అసిస్టెంట్ మరియు హవల్దార్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు – 04 మరియు హవల్దార్ – 10 ఉన్నాయి. 

🔥 విద్యార్హతలు : 

  • ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా డేటా ఎంట్రీ వర్క్ చేయగలిగిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
  • హవల్దార్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

🔥  వయస్సు :

  • టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు .
  • హవల్దార్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఈ హవల్దార్ ఉద్యోగాలకు శారీరక కొలతలు కలిగి ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు : 

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. 

🔥 అప్లికేషన్ విధానం :

  • అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ కు అవసరమైన సర్టిఫికెట్స్ అన్ని జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి. మరియు అప్లికేషన్ Soft Copy లను మెయిల్ చేయాలి. 
  • అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి – [email protected]

🔥 అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ :

  • అప్లికేషన్ పంపేవారు తప్పనిసరిగా క్రింది విధంగా అప్లికేషన్ పంపే కవర్ మీద రాయాల్సి ఉంటుంది. 
  • Application of Meritorious  Sportspersons” in Central GST and CX, RANCHI ZONE PATNA — 2024. 
  • For the post of TAX ASSISTANT / HAVALDAR under Sports Quota — 
  • NAME OF THE SPORT:—
  • అడ్రస్ : The Joint Commissioner (CCA) O/o the Chief Commissioner, CGST & CX, RANCHI ZONE PATNA ,1st FLOOR, CENTRAL REVENUE BUILDING (ANNEXE), BIRCHAND PATEL PATH, PATNA-800 001

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులు పాల్గొన్న క్రీడల ఆధారంగా ఎంపిక చేస్తారు. అనగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, యూనివర్సిటీ స్థాయి, ఇండియన్ యూత్ గేమ్స్, పాఠశాల స్థాయిలో క్రీడలు లేదా ఆటల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్య క్రమం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 

🔥 జీతము :

  • టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవెల్-4 ప్రకారం 25,500/- నుండి 81,100/- వరకు పేస్కేల్ ఉంటుంది. 
  • హవల్దార్ ఉద్యోగాలకు లెవల్-1 ప్రకారం 18,000/- నుండి 56,900/- వరకు పేస్కేల్ ఉంటుంది. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 23-11-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 30 రోజుల్లోపు చేరే విధంగా అప్లికేషన్ పంపించాలి. (23-12-2024).

🔥 జాబ్ లొకేషన్ : 

  • ఎంపికైన వారికి పాట్నా మరియు రాంచి ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారు.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే .అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Download Full Notification – Click here 

Download Application – Click here 


👉 Join Our What’s App Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!