ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నందు గల సెంట్రల్ హాస్పిటల్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటీఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు ఒక సంవత్సరం పాటు తిరుపతి / తిరుమల లోని టీటీడీ హాస్పిటల్స్ లో పనిచేయాల్సి వుంటుంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం మరియు ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 IDBI బ్యాంక్ లో 600 ఉద్యోగాలను భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ హాస్పిటల్ , తిరుపతి
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సివిల్ అసిస్టెంట్ సర్జన్స్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 06
🔥 విద్యార్హత :
- యుజిసి ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్ అయి వుండాలి.
🔥 ఎంపిక విధానం :
- 100 మార్కుల కు గాను ఎంపిక చేస్తారు.
- ఇందులో 80 మార్కులకు అకడమిక్ క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కులను కేటాయించారు.
- ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత ప్రతి సంవత్సరానికి 1మార్క్ చొప్పున 10 మార్కులు కేటాయించారు.
- ప్రఖాత్యిగాంచిన ఆసుపత్రులలో పనిచేస్తే 5 శాతం మార్కులు , ఇంటర్వ్యూ లో పెర్ఫార్మెన్స్ కు 5 శాతం మార్కులు కేటాయించారు.
🔥 ఇంటర్వ్యూ నిర్వహణ తేది:
25/11/2024 ఉదయం 11:00 గంటల కి , సెంట్రల్ హాస్పిటల్ ,తిరుపతి నందు నిర్వహిస్తారు.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు :
- బయోడేటా ( లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి , క్యాపిటల్ లెటర్స్ తో సంతకం చేయబడి వుండాలి )
- డేట్ ఆఫ్ బర్త్ కోసం 10 వ తరగతి లేదా తత్సమాన అర్హత అర్హత ధృవపత్రం ( అట్టెస్టడ్)
- అట్టెస్ట్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ కాపీ
- ఏపీ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ కాబడిన సర్టిఫికేట్
- అన్ని సంవత్సరాల అట్టెస్టడ్ ఎంబీబీఎస్ మార్క్స్ కాపీలు
- అట్టెస్టడ్ ఇటీవల కుల దృవీకరణ పత్రం
- 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల అట్టెస్టడ్ స్టడీ సర్టిఫికెట్ కాపీలు
🔥 జీతం :
- 53,495/- రూపాయల కన్సాలిడేటెడ్ పే లభిస్తుంది.