ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాయ శాఖ ఆలయాల్లో ఖాళీలు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది .
దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల్లో గతంలో ఆ శాఖ కమిషనర్ ద్వారా అనుమతి పొందిన క్యాడర్ స్ట్రెంత్ కు అనుగుణంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం ప్రస్తుతం ప్రస్తుతం చర్యలు చేపట్టింది .
ఈనెల 8వ తేదీన ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన దేవదాయ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై చర్చించడం జరిగింది .
ఈ సమావేశంలో తీసుకున్న మినిట్స్ వివరాలు ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది . ఈ నేపథ్యంలోనే అన్ని దేవాలయాల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు కసరత్తు ప్రారంభమైంది .
ఆలియాల్ వారీగా ఖాళీలు వివరాలను ఆర్జెసి లు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించిన తర్వాత తుది ఆమోదానికి ప్రభుత్వానికి పంపిస్తారు .
ఆర్యల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ముందుగా పత్రిక ప్రకటనల ద్వారా తెలియజేస్తారు .
నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రిగారు ఆదేశాలు జారీ చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు .