రైల్వే ఉద్యోగాలకు అప్లై చేశారా ? అప్లికేషన్ స్వీకరించరా ? రిజెక్ట్ చేశారా ? ఇలా తెలుసుకోండి | RRB RPF SI Application Status Link | RPF SI Application Status Link

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి తాజాగా ఒక ముఖ్యమైన నోటీస్ విడుదల చేయడం జరిగింది.. 

ఈ నోటీస్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 452 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రక్రియ తేదీలు కూడా ముగిశాయి. అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమ అప్లికేషన్ స్వీకరించారా ? తిరస్కరించారా ? అనేది తెలుసుకోవచ్చు.. తాజాగా విడుదల చేసిన ఈ నోటీసులో దీనికి సంబంధించిన సమాచారం వెల్లడించారు. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

అప్లికేషన్ స్టేటస్ ను మూడు రకాలుగా తెలిపారు. అవి 

  • (i) Provisionally accepted 
  • (ii) Provisionally accepted with conditions and 
  • (iii) Rejected

అప్లికేషన్ స్టేటస్ ఎలా చూడాలి ? 

  • అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు.
  • అప్లికేషన్ స్టేటస్ చూడడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

అప్లికేషన్ స్టేటస్ కు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ను ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. 

  • ఫోన్ నెంబర్లు : 9592-001-188 & 0172-565-3333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!