Headlines

ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీలో ఉద్యోగాలు | YSRUHS Assistant Librarians Recruitment 2024 | AP Assistant Librarian Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు కనుక అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ అప్లై చేయండి.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని దిగువన ఇవ్వబడినవి. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

🔥 పోస్టుల పేర్లు : అసిస్టెంట్ లైబ్రేరియన్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 01

🔥 విద్యార్హత : 👇

  1. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లైబ్రరీ సైన్స్ లో 55% మార్కులతో సెకండ్ క్లాసులో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  2. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.

🔥 జీతము : 34,580/- నుండి 10,7510/-

🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ పరిక్ష ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 06-04-2024

🔥 హాల్ టికెట్స్ విడుదల తేది: అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

🔥 పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్  తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాల (12-03-2024 నాటికి)

🔥 గరిష్ఠ వయస్సు:.42 సంవత్సరాలు (12-03-2024 నాటికి)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు వయసులో పది సంవత్సరాల సడలింపు కలదు.

🔥 ఫీజు : 

  1. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ మరియు PBDs అభ్యర్థులకు 750/- రూపాయలు.
  1. ఇతరులకు 1500/- రూపాయలు

🔥 ఎంపిక విధానం: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 2 పేపర్స్ తో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు.

2 పేపర్స్ కలిపి మొత్తం 300 మార్కులకు ఇస్తారు. ప్రతి పేపర్ కు 150 నిమిషాల సమయం ఇస్తారు.

పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ  స్థాయిలో) నుండి 150 ప్రశ్నలు, 150 మార్కులకి ఇస్తారు.

పేపర్-2 లో లైబ్రరీ సైన్స్ ( డిగ్రీ  స్థాయిలో) నుండి 150 ప్రశ్నలు, 150 మార్కులకి ఇస్తారు.

ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.

పూర్తి సిలబస్ వివరాలు నోటిఫికేషన్ చూసి తెలుసుకోండి.

🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్

పరీక్షలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫైనల్ సెలెక్షన్ లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకోరు.

Note: ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!