Andhra Pradesh Pharmacy Officer Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఫార్మసీ ఆఫీసర్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతం, అప్లికేషన్ విధానం మరియు ఇతర వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి…
Table of Contents :
▶️ Pharmacy Officer నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము, గుంటూరు నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
జోన్-3 లో ఫార్మసీ ఆఫీసర్ (ఫార్మసిస్ట్ గ్రేడ్ 2) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఫార్మసీ ఆఫీసర్ (ఫార్మసిస్ట్ గ్రేడ్ 2) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఇందులో గుంటూరు జిల్లాలో ఒక పోస్టు, పల్నాడు జిల్లాలో 5 పోస్టులు, బాపట్ల జిల్లాలో మూడు పోస్టులు, ప్రకాశం జిల్లాలో నాలుగు పోస్టులు, నెల్లూరు జిల్లాలో ఏడు పోస్టులు, తిరుపతి జిల్లాలో మూడు పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు :
పదో తరగతి పాస్ అయ్యి అయ్యి ఉండాలి. మరియు డి.ఫార్మసీ , బీ.ఫార్మసీ లేదా ఫార్మా.డి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
అప్లికేషన్ ఫీజు వివరాలు :
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, జోన్ -3 అనే పేరు మీద చెల్లి బాట అయ్యేవిధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఓసి అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టి, బీసీ, PWD అభ్యర్థులు 300/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అభ్యర్థుల ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు అర్హత పరీక్షలు వచ్చిన మార్కుల మెరిట్, గతంలో పనిచేసిన అనుభవానికి మార్కుల కేటాయింపు వంటి వివరాలు ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
జీతము వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 32,670/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఆర్టీసీ బస్సు స్టాండ్ బ్యాక్ సైడ్, ఓల్డ్ గుంటూరు, గుంటూరు – 522001 అనే అడ్రస్ లో అప్లికేషన్ కు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ లు జతపరిచి అప్లై చేయాలి.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే www.inbjobs.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి.
▶️ Download Full Notification – Click here
▶️ Official Website – Click here
