AP NHM NTEP Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము నుండి నేషనల్ ట్యూబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ రీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఫిబ్రవరి 4వ తేదీ లోపు అప్లై చేయాలి. గతంలో అప్లై చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు మళ్ళీ అప్లై చేయాలి. కానీ గతంలో అప్లై చేసిన వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసేవారు దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లై చేయాలి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.
Table of Contents
నోటిఫికేషన్ జారీచేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా లో ఉన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ కు చెందిన నేషనల్ ట్యూబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో వివిధ రకాల ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసినందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
మెడికల్ ఆఫీసర్ (DTC), DOTS ప్లస్ TB HIV సూపర్వైజర్, అకౌంటెంట్ (ఫుల్ టైం), PPM కోఆర్డినేటర్, TBHV – NGO/PP, ల్యాబ్ టెక్నీషియన్, SR ట్రీట్మెంట్ సూపర్వైజర్ (STS), సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..
ఉద్యోగాలు వాటి జీతం వివరాలు :
మెడికల్ ఆఫీసర్ (DTC) – 61,960/- rupayalu
DOTS ప్లస్ TB HIV సూపర్వైజర్ – 35,625/- రూపాయలు
అకౌంటెంట్ (ఫుల్ టైం) – 18,233/- రూపాయలు
PPM కోఆర్డినేటర్ – 28,980/- రూపాయలు
TBHV – NGO/PP – 26,619/- రూపాయలు
ల్యాబ్ టెక్నీషియన్ – 23,393/- రూపాయలు
SR ట్రీట్మెంట్ సూపర్వైజర్ (STS) – 33,975/- రూపాయలు
సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) – 33,975/- రూపాయలు
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీలకు సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం వివరాలు :
అడుగులేన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
గత నోటిఫికేషన్ లో పోస్టులకు అప్లై చేసిన వారు మళ్ళీ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. కొత్తగా అప్లై చేసే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లై చేయాలి.
ఓసి అభ్యర్థులు అయితే 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
SC, ST, BC అభ్యర్థులు 300/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
టీబీ అధికారి, పల్నాడు జిల్లా, నరసరావుపేట (పాత గవర్నమెంట్ ఆసుపత్రి) నందు అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జతపరిచి జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీల్లో సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ అందజేయాలి.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
✅ Download Notification & Application – Click here
