ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. డిఈడి, బిఈడి పూర్తి చేసిన వారి కోసం త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మరోపక్క టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ పరీక్ష నిర్వహించారు. అయితే 2022, 2023 లో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా డీఎస్సీ కి అప్లై చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఇప్పుడు టెట్ నిర్వహించాలని అనుకుంటుంది.
2022 ఆగస్టులో విడుదల చేసిన టెట్ పరీక్షను 4.5 లక్షల మంది రాశారు. అందులో రెండు లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి ఐదు లక్షల మంది టెట్ పరీక్ష రాసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.
అలాగే 6,000 నుండి 10,000 మధ్య ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయబోతుంది.
టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం అభ్యర్థులకు మేలు కలిగే విధంగా కొన్ని నిబంధనలు కూడా సడలించడం జరిగింది.