తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ జాతీయ ఆరోగ్య మిషన్ కు చెందిన PMJANMAN యొక్క మొబైల్ మెడికల్ యూనిట్స్ లో వివిధ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్స్, జిఎన్ఎమ్ స్టాఫ్ నర్స్ లు, పారామెడికల్ కం అసిస్టెంట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు జనవరి 8వ తేదీ నుండి జనవరి 12వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులు భర్తీ చేస్తున్నారు . ఇందులో
మెడికల్ ఆఫీసర్ పోస్టులు – 04, GNM స్టాఫ్ నర్సులు – 04 , ల్యాబ్ టెక్నీషియన్లు – 04, పారామెడికల్ కం అసిస్టెంట్ – 04 పోస్టులు ఉన్నాయి.
జీతము :
మెడికల్ ఆఫీసర్ పోస్టులు – 52,000/-
GNM స్టాఫ్ నర్సులు – 29,900/-
ల్యాబ్ టెక్నీషియన్లు – 27,500/-
పారామెడికల్ కం అసిస్టెంట్ – 15,000/-
ఫీజు : 300/-
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఈ ఫీజును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొమరం భీం ఆసిఫాబాద్ పేరుమీద డిడి రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులో తీయాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
O/o జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ℅ IDOC బిల్డింగ్, మొదటి ఫ్లోర్ , రూమ్ నెంబర్ F-25, కొమరం భీం ఆసిఫాబాద్,
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్స్ , సంబంధిత కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ , కుల ధ్రువీకరణ పత్రము మరియు ఒకటి నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువీకరణ పత్రము వంటి సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.