Headlines

అటవీ శాఖలో పదో తరగతి ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | ICFRE – IFGTB Recruitment 2024 | Forest Department jobs Notifications

భారత ప్రభుత్వం , ఎన్విరాన్మెంట్ & ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ & ట్రీ బ్రీడింగ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది . 

ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , లోయర్ డివిజనల్ క్లర్క్ , టెక్నీషియన్ & టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ & ట్రీ బ్రీడింగ్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 16

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 
  • లోయర్ డివిజనల్ క్లర్క్ 
  • టెక్నీషియన్ 
  • టెక్నికల్ అసిస్టెంట్

🔥 విద్యార్హత

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 10 వ తరగతి ఉత్తీర్ణత అయి వుండాలి.
  •  లోయర్ డివిజనల్ క్లర్క్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి 12 వ తరగతి ఉత్తీర్ణత & ఇంగ్లీష్ భాష లో నిముషానికి 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
  • టెక్నీషియన్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి సైన్స్ స్ట్రీమ్ లో  60 శాతం మార్కులతో 10 + 2 ఉత్తీర్ణత కలిగి వుండాలి.
  •  టెక్నికల్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి సైన్స్ స్ట్రీమ్ లో సంబంధిత విభాగంలో  ( అగ్రికల్చర్ / బయో టెక్నాలజీ / బొటనీ / ఫోరెస్ట్రీ  / జువాలజీ లలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • విద్యార్హత నిర్ధారణ కొరకు 30/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.

🔥 గరిష్ఠ వయస్సు :

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , లోయర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు 18 సంవత్సరాల వయస్సు నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు గల వయస్సు వుండాలి.
  • ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు.
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
  • అభ్యర్థులు తేది : 08/11/2014 నుండి  తేది : 30/11/2024 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :  అన్ రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు & మహిళా , ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • లోయర్ డివిజనల్ క్లర్క్  & టెక్నీషియన్  : అన్ రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు & మహిళా , ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • టెక్నికల్ అసిస్టెంట్ : అన్ రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 1500 రూపాయలు & మహిళా , ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • PwBD అభ్యర్థులు పైన పేర్కొన్న అన్ని పోస్టులకు సంబందించి ఎటువంటి అప్లికేషన్ చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం :

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : నెలకు 18000/- రూపాయల జీతం లభిస్తుంది.
  • లోయర్ డివిజనల్ క్లర్క్ : నెలకు 19900/- రూపాయల జీతం లభిస్తుంది.
  • టెక్నీషియన్ : నెలకు 21700/- రూపాయల జీతం లభిస్తుంది.
  • టెక్నికల్ అసిస్టెంట్ : నెలకు 29200/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులు ను వ్రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
  • వ్రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ తమిళనాడు లో గల కోయంబత్తూర్ లో మాత్రమే నిర్వహిస్తారు.
  • వ్రాత పరీక్ష  ఓఏంఆర్ ఆధారిత మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు లలో వుంటుంది. ఋణాత్మక మార్కుల విధానం కూడా వుంది.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 08/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 30/11/2024
  • వ్రాత పరీక్ష నిర్వహణ : జనవరి 2025 లేదా ఫిబ్రవరి 2025
  • అర్హత నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది : 12/11/2024

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!