భారత నావిక దళంలో 10+2 అర్హతతో సైలర్స్ పోస్టుల భర్తీకి అవి వివాహిత పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతూ SSR Medical Assistant 02/2024 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు అర్హులైన వారు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 17వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు ఇండియన్ నేవీలో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంచి జీతంతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ , ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. చిన్న వయసులోనే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, జీతము, ఎంపిక విధానము వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.
✅ 10+2 అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ నేవీ
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : ఇండియన్ నేవీలో సైలర్స్ (మెడికల్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : ఖాళీల సంఖ్య ఈ నోటిఫికేషన్ లో తెలుపలేదు.
✅ అటవీ శాఖలో 10+2 అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి. 👇 👇 👇
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ తో 10+2 పరీక్షలో సరాసరి 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
- ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు వచ్చి ఉండాలి.
🔥 వయస్సు : 01-11-2003 నుండి 30-04-2007 తేదీల మధ్య పుట్టిన తేదీ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ( 17 ½ నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు )
🔥 స్టైఫండ్ : శిక్షణ సమయంలో నెలకు 14,600/- స్టైఫండ్ ఇస్తారు.
🔥 జీతము : Level -3 ప్రకారం 21,700/- 69,100/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- జీతంతో పాటు ఎంపికైన వారికి చాలా రకాల సదుపాయాలు కల్పిస్తారు.
- 75 లక్షలు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.
- ప్రమోషన్స్ పొందడం ద్వారా లెవెల్ – 8 వరకు పే స్కేల్ వచ్చే ఉద్యోగాలు పొందవచ్చు.
✅ 10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ – Click here
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 07-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 17-09-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది.
- స్టేజ్ -1 లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- స్టేజ్ – 2 లో శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
- తరువాత రాత పరీక్ష మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
🔥 పరీక్ష విధానం :
- పరీక్షలో ప్రశ్నలు 10+2 స్థాయిలో ఇస్తారు.
- పరీక్ష ప్రశ్నా పత్రము ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో ఉంటుంది.
- ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
- ఇందులో ఇంగ్లీష్, సైన్స్, బయాలజీ, జనరల్ అవేర్నెస్ / రీజనింగ్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు వస్తాయి.
- ప్రతి సబ్జెక్ట్ నుండి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్షా సమయం ఒక గంట (60 నిమిషాలు)
🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
🏹 Download Notification – Click here