Headlines

10th అర్హతతో పశు సంవర్థక శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Regional Fodder Station, Hyderabad Recruitment 2024 | Latest Government Jobs Alerts in Telugu

పశుసంవర్ధక శాఖలో ఫార్మ్ అటెండెంట్ కం లేబర్ మరియు డ్రైవర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైతే హైదరాబాదులో పోస్టింగ్ వస్తుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్లైన్ విధానం ద్వారా పంపించాలి. అనగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేయండి. ఈ ఉద్యోగాలు ఎంపికలో ప్రొఫెషియన్సీ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Regional Fodder Station, Hyderabad 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఫార్మ్ అటెండెంట్ కం లేబర్ మరియు డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తము ఖాళీల సంఖ్య – 06 .. ఇందులో 

  • ఫార్మ్ అటెండెంట్ కం లేబర్ పోస్టులు సంఖ్య – 05 
  • డ్రైవర్ పోస్టుల సంఖ్య – 01

🔥 విద్యార్హత : 10th పాస్ 

🔥 జీతము : 

  • ఫార్మ్ అటెండెంట్ కం లేబర్ ఉద్యోగాలకు పే స్కేల్ 19,000/- నుండి 63,200/-
  • డ్రైవర్ పోస్టుల సంఖ్య ఉద్యోగాలకు పే స్కేల్ 18,000/- నుండి 56,900/-

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : 

  • ఫార్మ్ అటెండెంట్ కం లేబర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు
  • డ్రైవర్ పోస్టులకు ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు : 

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు తమ అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి. 

🔥 ఎంపిక విధానం :  అప్లై చేసిన అభ్యర్ధులకు ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తరువాత స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!