ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశం లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన ఐదు హామీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఇందులో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ, ఏప్రిల్ ఒకటి నుంచి ఫించను 4వేలకు పెంపు , ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సెస్-2024, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అంశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు మంత్రివర్గం ముందు ఉంచారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జులై 1న ప్రారంభించి డిసెంబర్ 10వ తేదీ లోపు పూర్తిచేసేలా ప్రణాళిక అధికారులు రూపొందించారు. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది.
అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో టెట్ తో కలిపి డీఎస్సీ నిర్వహణ , టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ వంటి వాటిపై చర్చించారు.
DSC లో 16,347 పోస్టులు భర్తీకి సంబంధించి మరికొంత సమాచారం :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై పెట్టారు. ఇందులో మొత్తం 16,347 పోస్టులు భర్తీకి అయిన ఆమోదం తెలిపారు.
భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- స్కూల్ అసిస్టెంట్ – 7,725 పోస్టులు
- SGT – 6,371 పోస్టులు
- TGT – 1781 పోస్టులు
- PGT – 286 పోస్టులు
- ప్రిన్సిపల్స్ – 52 పోస్టులు
- పిఈటి – 132 పోస్టులు
దీంతో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC మరియు నర్సింగ్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..