తెలంగాణ వైద్య ,ఆరోగ్య శాఖలో పర్మినెంట్ విధానములో 5,348 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఈ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ వివిధ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC , APPSC, TSPSC మరియు నర్సింగ్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే
🔥 Download Our APP – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ 5,348 ఉద్యోగాలు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ , వైద్య విద్య డైరెక్టరేట్ ,వైద్య విధాన పరిషత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ , ఔషధ నియంత్రణ మండలి, ఆయుష్ మరియు MNJ క్యాన్సర్ ఆసుపత్రి లలో పోస్ట్లు ఉన్నాయి.
భర్తీ చేయబోయే పోస్టుల్లో 1610 వైద్యులు పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 636 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు , 1014 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా ఉన్నాయి.
తెలంగాణలో కొద్ది నెలల క్రితం వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 7వేల స్టాఫ్ నర్స్ పోస్టుల రిక్రూట్మెంట్ పూర్తి చేశారు. ఈసారి భర్తీ చేయబోయే పోస్టుల్లో 1988 స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలే కాక 764 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు , 191 ఫార్మసిస్ట్ పోస్టులు, 85 ఏఎన్ఎం పోస్టులు కూడా ఉన్నాయి.
ఈ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయబోతుంది.