ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలను ఈనెల 22వ తేదీన అనగా సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి గారు తెలిపారు.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు ఈ ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుండి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు.
పదో తరగతి పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 6,24,000 మంది విద్యార్థులు రాశారు. ప్రైవేట్ గా 1.02 లక్షల మంది పరీక్షలు రాసారు.
ఫలితాలను పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా నమోదు చేసి విద్యార్థులు తెలుసుకోవచ్చు.
ఫలితాల విడుదల చేసిన తరువాత ఇదే వెబ్సైట్ లో మీకు అప్డేట్ చేస్తాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..