ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్న ఇస్రో కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అవుతాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు వాటికి ఉండవలసిన అర్హతలు ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి….
మొత్తం పోస్టులు : 94
పోస్ట్ పేరు : టెక్నికల్ అసిస్టెంట్ , సైంటిఫిక్ అసిస్టెంట్ , లైబ్రరీ అసిస్టెంట్ , టెక్నీషియన్ బి
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు |
టెక్నికల్ అసిస్టెంట్ | 12 | సంబంధిత విభాగంలో డిప్లోమా మొదటి తరగతిలో ఉత్తీర్ణత |
సైంటిఫిక్ అసిస్టెంట్ | 6 | సంబంధిత విభాగంలో బిఎస్సి డిగ్రీలో మొదటి తరగతిలో ఉత్తీర్ణత |
లైబ్రరీ అసిస్టెంట్ | 2 | 1) డిగ్రీలో మొదటి తరగతిలో ఉత్తీర్ణత 2) లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ మొదటి తరగతిలో ఉత్తీర్ణత |
టెక్నీషియన్ B | 74 | పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ITI / NTC / NAC ఉత్తీర్ణత |
అప్లై చేయు విధానము : ఆన్లైన్
వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు
చివరి తేదీ : మే 16 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి .
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి , లింకు క్రింద ఇవ్వబడినది
✅ Official Website – Click here