ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ 900 పోస్టులతో విడుదల కాబోతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చే వారంలోపు విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడైన పరీగే సుధీర్ గారు తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో ఈ బుధవారం నాటికి అన్ని శాఖల నుండి ఖాళీలకు సంబంధించిన సమాచారం ఏపీపీఎస్సీకి చేరుతుందని , అలాగే జీవో 77 అమలుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయని ఈ ట్వీట్ ద్వారానే తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రయత్నించిన గౌతమ్ సవాంగ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.
గతంలో 508 గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం , కొద్దిరోజుల క్రితం 212 గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి అనుమతించింది. అంతేకాకుండా గత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానీ పోస్టులను కూడా ఈసారి విడుదల చేయబోయే నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయబోతున్నారు. కాబట్టి మొత్తంగా 900 వరకు గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీకి ఈసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో పరిగె సుధీర్ గారు ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను 2024లో ఫిబ్రవరిలో లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ఒక ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది.
గ్రూప్ 2 ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో విడుదల చేసిన నూతన సిలబస్ ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపికలో రెండు దశలు ఉంటాయి.
మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. రెండో దశలో మెయిన్స్ పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష లో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులవుతారు.
🔥 గ్రూప్ 2 ఉద్యోగాల నూతన సిలబస్ – Click here